పరిమళాలు వెదజల్లే పరిమెల్ల

మంచిమాట

 

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్

 

న బ్రూయాత్ సత్యమప్రియం

 

ప్రియంచ నానృతం బ్రూయాత్

 

ఏష ధర్మ స్సనాతనః (మను స్మృతి 4.138)

మన్మధనామ సంవత్సర చైత్ర సుద్ధ తదియనుండి షష్ఠి వరకు అనగా ౨౦౧౫ మార్చి ౨౩ నుండి ౨౫ వరకు శృంగేరి శారదాపీఠాదీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి వర్ధంతి సందర్భమున సపరికర అద్వైత వేదాంత సభలు పరిమెల్ల గ్రామములోని శారదాపీఠం శృంగేరివారి బ్రాంచి అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయమునందు జరిగినవి. ఆంధ్ర రాష్ట్రంలోని తర్క వేదాంత న్యాయశాస్త్ర పండితులు పల్గొన్నారు.
- గతనెల జూలై 10 నుండి 15 వ తేదీల మధ్య గ్రామ ప్రజలందరు ముత్యాలమ్మతల్లికి జాతర జరిపి భక్తి శ్రధ్ధలతో సేవించుకున్నారు. గ్రామ ఆడపడచులందరు జాతర సందర్భమున పుట్టింటికి వచ్చుటచే వూరంతా కళకళలాడి సోభాయమానంగా వెలుగొందింది.

-
వినాయక చవితికి అన్ని పేటలలోను గణపతి నవరాతృలు వైభవంగా జరుపుకున్నారు.