మంచిమాట
20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అందం అన్నది సత్యం యొక్క శోభ. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో. అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. |